- విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
- సైబరాబాద్ తరహాలో విశాఖ బే-టెక్ సిటీ అభివృద్ధి
- గ్లోబల్ సెమీకండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి
- క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి రాజధాని
- సూర్యలంక, గండికోట ప్రాంతాలకు టూరిజం మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల (ఎకనామిక్ రీజియన్స్) ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి అసలైన బ్లూప్రింట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఈ మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి బ్లూప్రింట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వాస్తవరూపంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేవలం పరిశ్రమల రాక, పెట్టుబడుల ఆకర్షణ మాత్రమే అభివృద్ధి కాదని, వాటి ద్వారా ప్రజల ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే అసలైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయాన్ని పెంచేలా అధికార యంత్రాంగం పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.
సైబరాబాద్ తరహాలో విశాఖ బే-టెక్ సిటీ
విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో యాంకర్ ప్రాజెక్టుగా చేపడుతున్న ప్రాంతానికి ‘విశాఖ బే-టెక్ సిటీ’గా నామకరణం చేశారు. గతంలో హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను నిర్మించిన విధంగానే, విశాఖకు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బే-టెక్ సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగర మేయర్‌కు వీఈఆర్ స్టీరింగ్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. ఈ రీజియన్‌లో 167 ప్రాజెక్టులకు గానూ ఇప్పటికే 64 ప్రాజెక్టులు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
విజయనగరం, అనకాపల్లి వైపు వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ముందస్తుగానే ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని చెప్పారు. భూ లభ్యత తక్కువగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సమన్వయంతో ప్రత్యేక ల్యాండ్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ఏడాదిలోగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ పూర్తి చేసి, తదుపరి సీఐఐ భాగస్వామ్య సదస్సును అక్కడే నిర్వహించాలని నిర్దేశించారు.
సెమీకండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్ల రంగాలకు అవసరమైన ఆర్ అండ్ డీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి క్లస్టర్లను బలోపేతం చేయడంతో పాటు ఈ రీజియన్‌లోని 16 పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
తిరుపతి ప్రాంతానికి ఇప్పటికే రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో రూ.5.70 లక్షల కోట్లు కేవలం గ్రీన్ ఎనర్జీ రంగంలోనే నమోదయ్యాయని వివరించారు. రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగానికి సంబంధించి ప్రత్యేక మాగ్నెటిక్ క్లస్టర్, మూడేళ్ల లక్ష్యంతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
క్వాంటం హబ్‌గా అమరావతి
అమరావతి ప్రాంతంలో ఆక్వా, కోకో, పామాయిల్ రంగాలు ప్రధాన ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయని, ప్రస్తుతం రూ.4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిని భవిష్యత్ ‘క్వాంటం కారిడార్’గా, క్వాంటం వ్యాలీ, క్వాంటం మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల అనుసంధానంతో పాటు అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం ఈ ప్రాంత పురోగతికి కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈల అనుసంధానం - నాలెడ్జ్ పార్టనర్లు
భారీ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, సేవలు అందించేలా ఎంఎస్ఎంఈలను పెద్ద పరిశ్రమలతో అనుసంధానించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పారిశ్రామిక క్లస్టర్ వద్ద విద్య, వైద్యం, నివాస సదుపాయాలతో కూడిన పూర్తి ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని సూచించారు. పరిశ్రమల వ్యర్థాల నుంచి విలువైన పదార్థాలను రీసైక్లింగ్ చేసే నూతన సాంకేతికతలపై దృష్టి పెట్టాలన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాలకు ఐఐటీ తిరుపతి, బిట్స్ పిలానీ వంటి ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ పార్టనర్లుగా నియమించుకోవాలని, పాన్-ఐఐటీ నిపుణుల సేవలను అందిపుచ్చుకోవాలని చెప్పారు.
పర్యాటకానికి మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో పర్యాటకాన్ని లాభదాయక ఆర్థిక వనరుగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. అరకు, లంబసింగి ప్రాంతాలకు రహదారులు, మౌలిక వసతులు మెరుగుపరచాలని, సీఐఐ సదస్సు ప్రతినిధులను అక్కడికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సూర్యలంక, గండికోట పర్యాటక ప్రాంతాలకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని, సూర్యలంకను వెంటనే నోటిఫై చేయాలని ఆదేశించారు.
ఓడరేవు, చినగంజాం, నిజాంపట్నం, దిండి తీర ప్రాంతాలను పర్యావరణహిత బీచ్ రిసార్టులుగా తీర్చిదిద్దాలన్నారు. అమరావతి-నాగార్జునకొండలను అనుసంధానిస్తూ బౌద్ధ సర్క్యూట్, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.
కేంద్ర ప్రభుత్వ సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం కింద ప్రతిపాదించిన రూ.9,180 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి ప్రణాళికల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల సీఈఓలు యువరాజ్, ముఖేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.