- ఈడీ ఛార్జిషీట్‌పై జగన్మోహన్ రెడ్డి స్పందించాలని బోండా ఉమా డిమాండ్
- క్విడ్ ప్రో కో వ్యవహారంలో జగన్ పాత్రపై ఈడీ వద్ద ఆధారాలున్నాయని వ్యాఖ్య
- సున్నపురాయి గనుల కేటాయింపులపై పత్రికా సమావేశంలో తీవ్ర ఆరోపణలు
- కోర్టు విచారణలను వాయిదాలతో తప్పించుకుంటున్నారని విమర్శ
- కుటుంబ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకూ సమాధానం చెప్పడం లేదని ప్రస్తావన
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్ పై ఆయన తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే జగన్, తనపై ఈడీ నమోదు చేసిన అభియోగాలపై ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు తేలుకుట్టిన దొంగలా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ద్వారా జగన్ క్విడ్ ప్రో కో వ్యవహారాలు మరోసారి బహిర్గతమయ్యాయని బోండా ఉమా ఆరోపించారు. 2008 జనవరిలో వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నంలో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను సజ్జల కుటుంబానికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్‌కు మంజూరు చేసి, ఆ తర్వాత జీవో నెం. 321 ద్వారా వాటిని దాల్మియా సిమెంట్స్‌కు బదలాయించారని ఆయన పేర్కొన్నారు. ఈ లీజుల కేటాయింపులో క్విడ్ ప్రో కో జరిగిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయని, ఈ కేసులో జగన్‌ను ఏ1 నిందితుడిగా చేర్చారని తెలిపారు. 2010లో దాల్మియా సిమెంట్స్ షేర్లను విదేశీ కంపెనీకి విక్రయించగా వచ్చిన రూ. 139 కోట్లను జగన్ తన సంస్థలకు మళ్లించారని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు.
ఈడీ స్వాధీనం చేసుకున్న సమాచారం ప్రకారం రూ. 55 కోట్లు హవాలా రూపంలో చేరాయని, ఈశ్వర్ సిమెంట్స్‌కు రూ. 2.14 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగిందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయని బోండా ఉమా తెలిపారు. గత 13 ఏళ్లుగా జగన్ బెయిల్‌పై ఉంటూ, 141 డిశ్చార్జ్ పిటిషన్లు, 3,400కు పైగా వాయిదాల ద్వారా విచారణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్ వ్యక్తిగత సహాయకుడి పేరిట కూడా విదేశాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆయన ఆరోపించారు.
మరోవైపు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు, ఆస్తుల పంపకాలపై సొంత కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు దాటవేస్తున్నారని బోండా ఉమా వ్యాఖ్యానించారు. ఈడీ ఛార్జిషీట్లపై, అవినీతి ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.