వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ రోజా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జగన్‌ను కలిసి ప్రత్యేకంగా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను రోజా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను ఆమె ‘సంక్షేమ సామ్రాట్’గా పేర్కొన్నారు.

"ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ప్రియతమ నాయకుడు, మా అన్న, సంక్షేమ సామ్రాట్ వైఎస్ జగన్ గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే అన్న చూపించిన ప్రేమ, ఆప్యాయతలను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది" అని రోజా తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

రోజా ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్‌ను కలిసినప్పటి ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.
20261117frf1c16b1bb017.jpg