- సిద్దిపేటలో సీఎం పర్యటన వేళ కల్వకుంట్ల కవిత ట్వీట్
- హరీశ్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కవిత ప్రశ్న
- హరీశ్ రావును టార్గెట్ చేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన వేళ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) తాను అందజేసిన ఫిర్యాదు పత్రాలను ఈరోజు ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
"అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సీఎం గారూ?" అంటూ కవిత నేరుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 14న సీఎంఓకు సమర్పించిన ఈ లేఖలను అధికారులు నవంబర్ 18న స్వీకరించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం, డిజైన్ మార్పులు, పంప్ హౌస్ పనుల్లో తీవ్ర నాణ్యతా లోపాలు జరిగాయని ఆమె ఆరోపించారు.
"సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో జరిగిన అవినీతి, డిజైన్ మార్పు, నాణ్యతా లోపాలు జరిగినట్లుగా మా దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు నీటిని తరలించే కాలువ డిజైన్లో మార్పులు, పంప్ హౌస్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన విచారణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం" అని కవిత తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.