- జానపద కథానాయకుడిగా వెలిగిన కాంతారావు
- ఎన్టీఆర్ - ఏఎన్నార్ తరువాత స్థానం ఆయనదే
- అనేక విజయాలను అందుకున్న నటుడు
- ఆర్ధికపరమైన ఇబ్బందులను లెక్కచేయని వైనం
- చివరివరకూ పోరాడిన యోధుడని చెప్పిన తమ్మారెడ్డి
తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో తన ప్రత్యేకతను చాటుకున్న కాంతారావు, సాంఘిక .. పౌరాణిక చిత్రాలలోను ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగా నష్టపోయిన ఆయన, తన చివరి రోజులలో ఆర్థికపరమైన ఇబ్బందులను చూశారు. ఆ సమయంలో టీవీ సీరియల్స్ చేస్తూ, ముందుకు వెళ్లారు. అలాంటి కాంతారావును గురించి 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు.
కాంతారావుగారు కథానాయకుడిగా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత తన పేరు చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగారు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇద్దరితోను సఖ్యతగా ఉంటూ, వాళ్లిద్దరి సినిమాలలోనూ నటించారు. ఎన్నో భారీ విజయాలను అందుకున్నారు. నిర్మాతగా కొన్ని సినిమాలు ఆయనకి నష్టాలు తెచ్చిపెట్టాయి. అందువలన ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు పాపం. ఒక స్థాయిలో డబ్బును .. హోదాను చూసిన కాంతారావు, ఆ తరువాత ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకుని నిలబడటం అంత తేలికైన విషయం కాదు" అని అన్నారు.
"కాంతారావుగారు సినిమాలను నిర్మించడం వలన నష్టాలు చూడవలసి వచ్చింది. సాధారణంగా అలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీలో గౌరవం తగ్గుతూ ఉంటుంది. అలాంటి సన్నివేశాలను ఫేస్ చేయడం ఒక స్థాయి వ్యక్తులకు అంత తేలికైన విషయం కాదు. అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ .. తాను ముందుకు వెళుతూ .. కుటుంబాన్ని నెట్టుకురావడం నిజంగా చాలా గొప్ప విషయమేనని చెప్పాలి. తెరపైనే కాదు .. జీవితంలో చివరి నిమిషం వరకూ ఆయన పోరాడుతూనే వచ్చారు. అందువలన కాంతారావుగారు చాలా ధైర్యవంతుడు అనే అంటాను" అని తన మనసులోని మాటను చెప్పారు.