ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలపై మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ అధినేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఆయన తనదైన శైలిలో ఒక పోల్ నిర్వహించారు. ఈ మేరకు నెటిజన్ల కోసం ఒక క్విజ్ పోస్ట్ చేశారు.

"నా ప్రియమైన రాష్ట్ర ప్రజలారా.. మీకు ఒక క్విజ్! రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు? ఈ క్రింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో మీ ఓటు ఎవరికి వేస్తారో దయచేసి దానిపైన క్లిక్ చేయండి" అని విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ క్విజ్ కోసం ఆయన నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. అందులో మొదటి ఆప్షన్‌గా 'రెడ్ బుక్ పార్టీనా', రెండో ఆప్షన్‌గా 'రప్పా రప్పా పార్టీనా', మూడో ఆప్షన్‌గా 'ఎన్నికల కమిషన్-పోలీసులా', నాల్గవ ఆప్షన్‌గా 'ప్రజలు-ప్రజాస్వామ్యమా' అని పేర్కొంటూ నెటిజన్ల అభిప్రాయాలను కోరారు.