- విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు ఖరారు
- సీఎం చంద్రబాబు, ఎంపీల విజ్ఞప్తితో రైల్వే శాఖ నిర్ణయం
- ఉదయం 5:35కు విశాఖలో బయల్దేరనున్న రైలు
- తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55కు తిరుపతిలో ప్రారంభం
- సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుల్లో హాల్టింగ్
రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి తిరుపతికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలపడంతో ఈ మార్గంలో రైలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రూట్‌తో పాటు హాల్టింగ్‌లు, సమయాలను దాదాపు ఖరారు చేసిన రైల్వే శాఖ, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు ఒకటి చొప్పున మొత్తం నాలుగు వందేభారత్‌లు నడుస్తున్నాయి. విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో వందేభారత్ స్లీపర్ రైలును నడపాలని నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఏడాది ఆ స్లీపర్ రైలుపై నిర్ణయం తీసుకోనుండగా, ప్రస్తుతానికి పగటి వేళల్లో విశాఖ-తిరుపతి మధ్య ఈ సాధారణ వందేభారత్ రైలును ప్రారంభించాలని నిర్ణయించారు.
సూత్రప్రాయంగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు ఉదయం 5:35 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. మార్గమధ్యంలో సామర్లకోట (ఉదయం 7:00), రాజమండ్రి (7:40), విజయవాడ (9:30), ఒంగోలు (10:55), నెల్లూరు (12:15) స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55 గంటలకు తిరుపతిలో బయలుదేరి నెల్లూరు (సాయంత్రం 4:48), ఒంగోలు (6:08), విజయవాడ (రాత్రి 7:25), రాజమండ్రి (9:23), సామర్లకోట (10:03) మీదుగా రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వేళలపై పూర్తి అధ్యయనం అనంతరం రైల్వే శాఖ తుది షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనుంది.