- దేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే రాహుల్ పాదయాత్ర ఎలా సాధ్యమైందన్న ఈటల
- ఎన్నికల మేనిఫెస్టో హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని విమర్శ
- రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రజల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు.
విదేశీ గడ్డపై భారత ఎన్నికల వ్యవస్థను, సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ అపహాస్యం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటలు, తీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలా లేవని ఎద్దేవా చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యమే లేకపోతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర ఎలా చేయగలిగారని ఆయన నిలదీశారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. "హైదరాబాద్‌కు వచ్చే ముందు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి రాహుల్ మాట్లాడారా. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ లేదు" అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.