- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన నితిన్ గడ్కరీ
- రిటైర్మెంట్ ప్రచారాన్ని అవాస్తవంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
- తన వ్యాఖ్యలను మీడియా సందర్భం లేకుండా ప్రసారం చేసిందని వెల్లడి
- ట్రస్ట్ బాధ్యతల గురించే మాట్లాడానని స్పష్టీకరణ
- రాజకీయాలు లేదా మంత్రివర్గ మార్పులతో దీనికి సంబంధం లేదన్న గడ్కరీ కార్యాలయం
తాను క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవి పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. తాను ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ప్రసార మాధ్యమాలు వక్రీకరించి చూపించాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నాగపూర్‌లో 17వ అగ్రోవిజన్ వ్యవసాయ ప్రదర్శన సన్నాహక సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ ప్రచారంపై వ్యంగ్యంగా స్పందించారు. "వయసు పైబడుతున్న కొద్దీ నవతరాన్ని ముందుకు తీసుకురావాలని అనడం సహజం. అయితే దాన్ని పట్టుకుని గడ్కరీ రిటైర్ కాబోతున్నారని మీరే తప్పుడు కథనాలు రాస్తున్నారు. మీరు మీ పని చేసుకుంటూ వెళ్లండి.. నేను నా పని నేను చేసుకుంటూ పోతాను" అని మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.
ఈ వివాదానికి దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఇటీవల నాగపూర్ జిల్లా కాటోల్లో లక్ష్మణ్‌రావ్ మాన్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ ట్రస్ట్ దాదాపు 40,000 మంది విద్యార్థులకు, 1,600 మంది ఉపాధ్యాయులతో ఏకల్ విద్యాలయాలను నడుపుతోంది. ఆ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను గత 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, కొవిడ్ అనంతర పరిస్థితుల్లో మునుపటిలా అధిక శ్రమతో పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. అందువల్ల తదుపరి తరం యువతకు ట్రస్ట్ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే, ఆయన వ్యాఖ్యలను అన్వయిస్తూ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయనే ప్రచారంతో ముడిపెట్టి, గడ్కరీ మంత్రి పదవికి లేదా క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నారంటూ సోషల్ మీడియా, పలు వార్తా సంస్థల్లో ప్రచారం జరిగింది.
దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన గడ్కరీ, ఆ ప్రకటన కేవలం లక్ష్మణ్‌రావ్ మాన్కర్ ట్రస్ట్ భవిష్యత్తు, నిర్వహణ కోసమే ఉద్దేశించినదని తేల్చిచెప్పారు. ఒక తరం నుంచి మరో తరానికి అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించడం సహజ ప్రక్రియ అని ఆయన వివరించారు. అంతకుముందు ఆయన కార్యాలయం కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. మంత్రి ప్రసంగాన్ని కొన్ని మీడియా ఛానళ్లు పూర్తిగా సందర్భం లేకుండా ప్రసారం చేశాయని, ఆ వ్యాఖ్యలకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.