- నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి చిరంజీవికి ఆహ్వానం
- నవంబర్ 25 నుంచి 27 వరకు వాక్ నిర్వహణ
- డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కలిసి నడవాలని పిలుపు
- సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రచారంలో భాగంగా నగరంలో నిర్వహించనున్న 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమానికి రావాల్సిందిగా చిరంజీవిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు భేటీ వివరాలను కిషన్ రెడ్డి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
మాదకద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా యువతను కాపాడుకునేందుకు, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, యావత్ భారతదేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' పేరుతో ఈ భారీ వాక్‌థాన్ జరగనుంది.
మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో హైదరాబాద్ ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరచడానికి చిరంజీవి తమతో కలిసి రానున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో చిరంజీవికి ఉన్న విశేష ఆదరణ ద్వారా యువతలో విస్తృత అవగాహన తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రగ్స్ లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ ఈ ఉద్యమంలో ఐక్యంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.