- కన్నడలో రూపొందిన 'మార్నమి'
- ఫిబ్రవరిలో విడుదలైన సినిమా
- కీలకమైన పాత్రలో చైత్ర జె ఆచార్
- విలేజ్ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 18 నుంచి మొదలైన స్ట్రీమింగ్
ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి వస్తున్న సిరీస్ లకు .. సినిమాలకి ఓటీటీ వైపు నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా నిన్న ఒక కన్నడ మూవీ 'అమెజాన్ ప్రైమ్' ట్రాక్ పైకి అడుగుపెట్టింది. ఆ సినిమా పేరే 'మార్నమి'. అంటే 'మహర్ణవమి' అని అర్థం. రిషిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, చైత్ర జె ఆచార్ .. రిత్విక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లకు వచ్చింది.
'మార్నమి' పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలో అంచనాలు పెంచుతూ వెళ్లింది. అందుకు తగినట్టుగానే థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ కనిపించింది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడలేకపోయిన వాళ్లు, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ వచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ఓటీటీ పట్టాలపైకి వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది.
ఒక గ్రామం .. అక్కడి విశ్వాసంగా కనిపించే పులివేషం కట్టడం .. రాజకీయాలు .. తల్లీకొడుకుల అనుబంధం .. భార్యాభర్తల ప్రేమ .. చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 'జలజ' కొడుకు 'చేతు' అనారోగ్యం బారిన పడతాడు. అతను కోలుకుంటే 'మహర్ణవమి' రోజున పులివేషం కట్టిస్తానని 'మరియమ్మ'కి ఆమె మొక్కుకుంటుంది. అయితే ఆ మొక్కు చెల్లించకుండానే ఆమె చనిపోతుంది. ఆ తరువాత 'చేతు'కి 'దీక్ష' అనే యువతితో పెళ్లి జరుగుతుంది. తల్లి చనిపోయిన తరువాత, భార్య వచ్చిన తరువాత అతని జీవితంలో చోటు చేసుకునే మలుపులే ఈ సినిమా కథ. త్వరలో ఈ సినిమా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.