- తిరుపతి మోడల్లో శబరిమల అభివృద్ధి.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అయ్యప్ప భక్తులకు అత్యాధునిక వసతులు
- సమగ్ర మౌలిక వసతుల కల్పన
- కొచ్చి విమానాశ్రయంలో 5,000 చదరపు అడుగుల్లో ప్రత్యేక సేవా కేంద్రం
- భక్తుల రాకను మరో 50 శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో తిరుమల-తిరుపతి తరహాలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు సమగ్రమైన రీతిలో అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (సియాల్) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శబరిమల యాత్రికుల సహాయ కేంద్రాన్ని (ఫెసిలిటేషన్ సెంటర్) ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేరళలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అయ్యప్ప భక్తులు శబరిమలలో దర్శనం ముగిసిన వెంటనే వెనుదిరగకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించేలా ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళిక ద్వారా శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య సుమారు 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
శబరిమల దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రస్తుతం కొనసాగుతున్న మండల పూజా సీజన్ ముగిసిన తర్వాత ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వృశ్చిక మాసం సీజన్ ప్రారంభానికి ముందే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని, పంబ, సన్నిధానంలలో స్వయంగా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు, కొచ్చి విమానాశ్రయంలోని డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్ సమీపంలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇక్కడ శబరిమలకు నేరుగా వెళ్లే కేరళ ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్సు సర్వీసులను కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
దీంతో పాటు డిమాండ్‌కు అనుగుణంగా చార్టర్డ్ బస్సులు, హెలికాప్టర్ బుకింగ్ కౌంటర్, ట్రావెన్కోర్ దేవస్వోం బోర్డు హెల్ప్ డెస్క్, ప్రసాదం కూపన్ కౌంటర్లను ఇక్కడ అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్, శాకాహార భోజన శాల, ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి గదులు, ఉచిత వైఫై, విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు తెలియజేసే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వ్యవస్థను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తులకు ఈ కేంద్రం ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుంది.