- టెస్టుల నుంచి రిటైర్ అవ్వడం కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు అన్న కపిల్
- తన నిర్ణయంపై పదేళ్ల తర్వాత కోహ్లీ పశ్చాత్తాపపడతాడని వెల్లడి
- 25 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడే ఫిట్‌నెస్ కోహ్లీ సొంతమని వ్యాఖ్య
- కోపంతో రిటైర్ అవ్వడం సరైంది కాదన్న కపిల్ దేవ్
- తన విలువను నిరూపించుకోవాల్సిన చోట ఉండలేనని గతంలో చెప్పిన కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అతిపెద్ద తప్పు చేశాడని 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని, ఈ విషయంలో పదేళ్ల తర్వాత అతను తప్పకుండా పశ్చాత్తాపపడతాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఇంకా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే సత్తా, ఫిట్‌నెస్ ఉన్నాయని స్పష్టం చేశాడు.
మిడ్-డేకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అవ్వడం అతను చేసిన అతిపెద్ద పొరపాటు. తన నిర్ణయంపై పదేళ్ల తర్వాత బాధపడతాడు. అతను రిటైర్ అయి ఉండాల్సింది కాదు. కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడితో సమానంగా పోటీపడగలడు" అని పేర్కొన్నాడు.
కోపంతో రిటైర్మెంట్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, ఈ విషయంలో మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. జట్టు నుంచి ఎన్నిసార్లు తొలగించినా, మొహిందర్ పట్టుదలతో తిరిగి జట్టులోకి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడని గుర్తుచేశాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో మరికొంత కాలం కొనసాగి ఉండాల్సిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
2025 మే నెలలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల కెరీర్‌లో 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో కలిపి 9,230 పరుగులు చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే, తన రిటైర్మెంట్ నిర్ణయాలపై గతంలో కోహ్లీ స్పందిస్తూ, తన విలువను నిరంతరం నిరూపించుకోవాల్సిన వాతావరణంలో ఉండాలనుకోవడం లేదని ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు.
ప్రస్తుతం కోహ్లీ వన్డే క్రికెట్‌పై దృష్టి సారించి, 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసినా, ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌లలో 7, 0, 5 పరుగులకే పరిమితమయ్యాడు. ప్రపంచకప్‌కు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతని ఫామ్ చర్చనీయాంశంగా మారింది.