- పనిభారం కారణంగా తప్పుకుంటున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి వెల్లడి
- అభిషేక్ శర్మతో హెడ్ విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెర
- హెడ్ వైదొలగడంతో ఎస్‌ఆర్‌హెచ్ పర్సులోకి రూ.14 కోట్లు జమ
- ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్న హెడ్
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెడ్, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి తెలియజేశాడు.
ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటైన 'ట్రావిషేక' (ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ) భాగస్వామ్యానికి తెరపడినట్టయింది. హెడ్ తప్పుకోవడం జట్టుకు పెద్ద లోటు అయినప్పటికీ, ఆర్థికంగా ఊరట లభించనుంది. 2025 మెగా వేలానికి ముందు రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న హెడ్ స్థానంలో, ఇప్పుడు ఆ మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ పర్సులోకి తిరిగి రానుంది.
ఆస్ట్రేలియా జట్టుకు రాబోయే రోజుల్లో తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్ ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ వంటి కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో పనిభారాన్ని తగ్గించుకోవాలని హెడ్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా తమకు ముఖ్యమైన క్రికెట్ రాబోతోందని, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గతంలోనే తెలిపారు.
2024 ఐపీఎల్ వేలంలో రూ. 6.8 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌లోకి వచ్చిన హెడ్, మూడు సీజన్ల పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2024లో 567 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో ముఖ్య భూమిక పోషించగా, 2025లో 374, 2026లో 410 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే.. నేటితో ముగియనున్న రిటెన్షన్ గడువుకు ముందే ఎస్‌ఆర్‌హెచ్ ట్రేడింగ్‌లో చురుగ్గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పేసర్ టి. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుని, జీషన్ అన్సారీని వదులుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డీల్‌లో ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను తీసుకుని, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను ఇచ్చింది.