- అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితాలో మునీర్, షరీఫ్
- సౌదీ రాజు సల్మాన్, ఎంబీఎస్, ఎర్డోగన్‌లతో కలిసి అగ్రస్థానం
- సౌదీ, టర్కీలతో కుదిరిన 'మక్కా రక్షణ ఒప్పందం' ఆధారంగా నంబర్ వన్ స్థానం
- భారత్ నుంచి టాప్-50లో చోటు దక్కించుకున్న ఏకైక నేతగా మౌలానా మహమూద్ మదానీ
- టాప్ 500 జాబితాలో ప్రేమ్‌జీ, ఒవైసీ, షారుక్, సల్మాన్, అమీర్, ఏఆర్ రెహమాన్
సొంత దేశంలో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలతో రోజూ కుస్తీలు పడే పాకిస్థాన్ నాయకులకు అంతర్జాతీయ వేదికపై ఊహించని కిరీటం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 50 మంది ముస్లింల జాబితాలో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంయుక్తంగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
జోర్డాన్‌కు చెందిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ (RISSC) విడుదల చేసిన 2027 నాటి 'ది ముస్లిం 500' నివేదికలో ఈ చిత్రం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌లతో కలిసి పాక్ నేతలిద్దరూ అగ్రస్థానాన్ని పంచుకున్నారు.
నిన్నమొన్నటి వరకు 450 మంది సాధారణ జాబితాలో ఉన్న మునీర్, షరీఫ్‌లు.. ఏకంగా మొదటి స్థానానికి దూసుకురావడం విడ్డూరంగా మారింది. గత ఆగస్టులో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీల మధ్య కుదిరిన 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్' వల్లే ఈ అరుదైన గౌరవం దక్కినట్లు నివేదిక పేర్కొంది. ఒకరిపై దాడి జరిగితే ముగ్గురిపై దాడి జరిగినట్లేనని చేసుకున్న ఈ ఒప్పందంలో.. సౌదీ సంపద, టర్కీ సాంకేతికతకు తోడు పాక్ సైనిక బలం ఒక్కటైందని సంస్థ విశ్లేషించింది. పాకిస్థాన్‌ను తెరవెనుక నడిపే అసలైన శక్తిగా మునీర్‌ను అభివర్ణిస్తూనే, ఆయన సాగిస్తున్న రాజకీయ అణచివేత, ఇమ్రాన్ ఖాన్ జైలు వ్యవహారాలను కూడా ప్రస్తావించడం గమనార్హం.
ఈ ప్రతిష్ఠాత్మక టాప్-50 జాబితాలో భారతదేశం నుంచి కేవలం ఒకే ఒక్కరికి చోటు దక్కింది. జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ 18వ స్థానంలో నిలిచారు. పౌరసత్వ హక్కులు, మైనారిటీల రక్షణ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఆయన సాగిస్తున్న న్యాయపోరాటాలను నివేదిక ప్రశంసించింది. కాగా టాప్ 50 కాకుండా మిగిలిన 450 మంది జాబితాలో అసదుద్దీన్ ఒవైసీ, అజీమ్ ప్రేమ్‌జీ, జకీర్ నాయక్‌లతో పాటు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఏఆర్ రెహమాన్ తదితరులు ఉన్నారు.