- ఉప్పు నీటి నుంచి తాగునీరు, ఏసీ అందించే పరికరం తయారీ
- బిట్స్ పిలానీ హైదరాబాద్ పరిశోధకులకు దక్కిన భారత పేటెంట్
- గంటకు 12.4 లీటర్ల మంచినీటి ఉత్పత్తి సామర్థ్యం
- కనీస ఉత్పత్తి ఖర్చు లీటరుకు 30 పైసలు మాత్రమే
- తీర ప్రాంతాలు, ద్వీపాల్లోని ప్రజలకు ఎంతో ప్రయోజనం
ఉప్పు నీటిని స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తూ, అదే సమయంలో గదికి చల్లటి ఏసీ గాలిని అందించే సరికొత్త పోర్టబుల్ పరికరాన్ని బిట్స్ పిలానీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సౌరశక్తితో పనిచేసే ఈ వినూత్న సాంకేతికతకు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా పేటెంట్ (పేటెంట్ నం. 558052) లభించింది. బిట్స్ పిలానీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సందీప్ ఎస్ దేశ్ముఖ్, ప్రొఫెసర్ శంతను ప్రసాద్ దత్తా, రీసెర్చ్ స్కాలర్ కె. సాయి సందీప్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు.
సాధారణంగా సముద్రపు నీటిని లేదా ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి, అలాగే గదులను చల్లబరచడానికి (ఏసీ) విడివిడిగా భారీ మొత్తంలో విద్యుత్ ఖర్చవుతుంది. అయితే, ఈ రెండు ప్రక్రియలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఈ పరిశోధకులు నిరూపించారు.
పనిచేసే విధానం:
ఈ పరికరం మొదట పరిసరాల్లోని సాధారణ గాలిని వేడి చేసి, దానిని హ్యుమిడిఫైయర్ ద్వారా పంపుతుంది. అక్కడ ఆ గాలి ఉప్పు నీటిలోని తేమను గ్రహిస్తుంది. ఆ తర్వాత, తేమతో కూడిన ఆ గాలిని చల్లబరిచినప్పుడు నీటి ఆవిరి ద్రవీభవించి స్వచ్ఛమైన తాగునీరుగా మారుతుంది. అదే సమయంలో బయటకు వచ్చే పొడి, చల్లని గాలి గదిని ఏసీ తరహాలో ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ విధంగా ఒకే ప్రక్రియ ద్వారా నీటి శుద్ధి, ఎయిర్ కండిషనింగ్ రెండూ పూర్తవుతాయి.
పరిశోధనలో తేలిన ఫలితాలు:
ప్రయోగశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదయ్యాయి. గరిష్ఠ తేమ ఉన్న పరిస్థితుల్లో డబుల్ స్టేజ్ సెటప్ ద్వారా గంటకు దాదాపు 12.4 లీటర్ల స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేయగలిగారు. అలాగే, 6.57 కిలోవాట్ల వరకు శీతలీకరణ (కూలింగ్) సామర్థ్యం నమోదైంది. దీనిద్వారా దాదాపు 14 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లటి గాలిని అందించడం సాధ్యమైంది. పరీక్షల్లో లీటరు నీటి కనీస ఉత్పత్తి వ్యయం కేవలం 30 పైసలుగా తేలింది. ఈ పరికరం ద్వారా రోజుకు 200 లీటర్ల తాగునీటిని అందించాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధనా పత్రం అంతర్జాతీయ జర్నల్ ‘అప్లైడ్ థర్మల్ ఇంజనీరింగ్’లో ప్రచురితమైంది. ఈ ఫలితాలు ప్రస్తుతం ల్యాబ్ స్థాయిలో సాధించినవి కావడంతో, వివిధ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించాలని బృందం యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు పారిశ్రామిక భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి కొరత, విపరీతమైన ఎండలతో ఇబ్బంది పడే తీర ప్రాంతాలు, ద్వీప వాసులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.