- శ్రీశైలం జలాశయంలో 829 అడుగులకు పడిపోయిన నీటి మట్టం
- వరుసగా వాయిదా పడుతున్న కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ సమావేశాలు
- తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య తేలని తాగునీటి కేటాయింపులు
- సకాలంలో నిర్ణయాలు తీసుకోకుంటే వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) సమావేశాలు నిరంతరం వాయిదా పడుతుండడం నేపథ్యంలో.. తెలంగాణలో తాగునీటి సంక్షోభం పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో నీటి పంపకాల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో రానున్న వేసవిలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు నీటి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 829.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, కనీస నీటిమట్టం (834 అడుగులు) కంటే దిగువకు పడిపోయింది. మొత్తం 215.80 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 48.57 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల నుంచి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి. నవంబర్ మొదటి తొమ్మిది రోజుల్లోనే 3.03 టీఎంసీల మేర నిల్వలు తగ్గాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వార్షిక ప్రవాహాలు 218 టీఎంసీలకు మాత్రమే పరిమితమయ్యాయి. రానున్న రోజుల్లో ఆవిరి కావడం, వేసవి డిమాండ్ పెరగడం వల్ల రిజర్వాయర్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, మే నెల నుంచి జరగాల్సిన 21వ కేఆర్ఎంబీ సర్వసభ్య సమావేశం వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిసారిగా 2025 జనవరి 21న ఈ సమావేశం జరిగింది. అటు అజెండాపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 18వ జీఆర్ఎంబీ సమావేశం కూడా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.
జనాభా ప్రాతిపదికన లేదా 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోంది. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు 5 టీఎంసీలతో పాటు, జూలై వరకు హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం అవసరాలకు మొత్తం 46 టీఎంసీల తాగునీటిని కేటాయించాలని తెలంగాణ పట్టుబడుతోంది.