- శ్రీకాకుళం నామినేషన్ కేంద్రం వద్ద బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు వీరంగం
- నిబంధనలకు విరుద్ధంగా కారుతో రావడాన్ని అడ్డుకున్న పోలీసులు
- బ్యారికేడ్లను ఢీకొట్టి పోలీసులపైకి కారు నడిపిన వైనం
- ఘటనలో సీఐ, ఎస్ఐలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- బీజేపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శ్రీకాకుళం నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద ఓ బీజేపీ నేత తన కారును పోలీసులపైకి నడపడంతో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పట్టణంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల కోసం బొందిలిపురంలోని వంశధార కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బీజేపీ శ్రీకాకుళం యూనిట్ మాజీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి, అక్కడి నుంచి అభ్యర్థులు నడుచుకుంటూ వెళ్లాలి.
ఈ నిబంధనను పోలీసులు వెంకటేశ్వరరావుకు వివరించి, కారును ఆపాలని సూచించారు. అయితే, కేంద్రం వరకు కారులోనే వెళతానని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వెంకటేశ్వరరావు, తన కారును అకస్మాత్తుగా ముందుకు నడిపి అక్కడున్న బ్యారికేడ్లను, పోలీసు సిబ్బందిని ఢీకొట్టారు.
ఈ ఘటనలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్-ఇన్‌స్పెక్టర్ మెట్ట సుధాకర్ గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీకాకుళం మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన చల్లా గ్రీష్మకు వెంకటేశ్వరరావు తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.