- మల్కాజిగిరిలో మహిళలను వేధించిన 206 మంది అరెస్ట్
- అక్టోబర్ నెలలో 220 ఫిర్యాదులు స్వీకరించిన షీ టీమ్స్
- ఫోన్, సోషల్ మీడియా వేధింపుల కేసులే అధికం
- ఆకతాయిలను వదిలిపెట్టేది లేదని పోలీసు కమిషనర్ హెచ్చరిక
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతుల భద్రతకు భరోసా కల్పిస్తూ షీ టీమ్స్ ఆకతాయిలపై ఉక్కుపాదం మోపాయి. అక్టోబర్ నెలలో మహిళలను వేధించినందుకు గాను మొత్తం 206 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 195 మంది మేజర్లు కాగా, మరో 11 మంది మైనర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో షీ టీమ్స్‌కు మొత్తం 220 ఫిర్యాదులు అందాయి. వీటిలో 61 ఫోన్ కాల్స్ ద్వారా, 70 సోషల్ మీడియా వేదికల ద్వారా అందగా, మరో 89 నేరుగా జరిగిన వేధింపులకు సంబంధించినవి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 14 క్రిమినల్ కేసులు, 106 పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగిలిన 96 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీ నగర్‌లోని పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు.
కొన్ని కీలక కేసులను పరిశీలిస్తే.. ఒక యువతితో పరిచయం ముగిసిన తర్వాత ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానని బెదిరించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 17 ఏళ్ల బాలికను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసిన ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.
కేసుల నమోదుతో పాటు షీ టీమ్స్ 128 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి 15,852 మందికి మహిళా హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాయి. మెట్రో రైళ్లలో మహిళల బోగీలలో ప్రయాణిస్తున్న ఆరుగురు పురుషులను పట్టుకుని జరిమానా విధించారు. మహిళలు, యువతులను వేధించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. వేధింపులకు గురైన వారు వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా స్థానిక షీ టీమ్స్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.