- విద్య, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామన్న రేవంత్
- ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని వెల్లడి
- విద్య, నీటిపారుదలకు నెహ్రూ బలమైన పునాదులు వేశారని వ్యాఖ్య
- మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి వల్లే భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నారని వెల్లడి
- మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల మెరుగుదలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మారుస్తున్నామని చెప్పారు. ఆధునిక వసతులతో స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశంలో విద్య, నీటిపారుదల రంగాల అభివృద్ధికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారని సీఎం పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, యూనివర్సిటీలు, ఐఐటీల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.
సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని, బ్లూకాలర్ ఉద్యోగాలకు మాత్రం ఆ ప్రమాదం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని గుర్తుచేశారు. మీరాలం చెరువుపై రూ.600 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మూసీ అభివృద్ధి పూర్తయితే పాతబస్తీకి పర్యాటకుల రాక పెరుగుతుందని, నగరంలో నైట్ ఎకానమీకి ఊతం లభిస్తుందని చెప్పారు. ఎస్‌ఐఆర్ పేరుతో పేదలు, మైనార్టీలు, ఎస్టీల ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.