- విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రధారులు
- వచ్చే ఏడాది జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్
- లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్త నిర్మాణం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారైంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మేరకు మద్రాస్ టాకీస్ సోషల్ మీడియా వేదికగా సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ.. "ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. జనవరి 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘ఇంజి వెల్లం’ సందడి షురూ" అంటూ పోస్ట్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో ఒక ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ క్లిప్ ద్వారా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘ఇంజి’ (అల్లం) ఎవరు, ‘వెల్లం’ (బెల్లం) ఎవరు అంటూ విజయ్ సేతుపతి, సాయి పల్లవి మధ్య సాగే సరదా సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘చెక్క చివంత వానమ్’ (నవాబ్) తర్వాత మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, అవిక్ ముఖోపాధ్యాయ్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అగ్ర శ్రేణి నటీనటులు, దిగ్గజ సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.