- విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
- కేంద్ర మంత్రి, పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- వివిధ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు
- ప్లాంట్ విస్తరణపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్న కియా సంస్థ
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విశాఖ నగరం రెండు రోజుల పెట్టుబడుల పండుగకు సిద్ధమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 ఈ రోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్‌తో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎంఎస్‌ఎంఈ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్లీనరీ హాల్‌లో జరిగిన సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, పెట్టుబడులకు ఉన్న అనువైన అవకాశాలను ఆయన వివరిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు నోవోటెల్ హోటల్‌లో జరిగే మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును కూడా సీఎం ప్రారంభించనున్నారు.
సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, విదేశీ రాయబారులతో వరుసగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా కియా కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎయి చుల్ జెంగ్, సీఈఓ గ్వాన్గు లీలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో తమ ప్లాంట్‌ను విస్తరించేందుకు కియా సంస్థ ప్రభుత్వంతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ రెండు రోజుల పాటు విశాఖ నగరం దేశ, విదేశీ పెట్టుబడుల చర్చలకు కేంద్రంగా నిలవనుంది.