- మూడో వన్డే తర్వాత కోచింగ్ సిబ్బంది విభజన
- వన్డే జట్టుతోనే గంభీర్, బహుతులే
- టెస్టు జట్టుతో వెల్లింగ్టన్‌కు కొటక్, మోర్కెల్
- నవంబర్ 19న తొలి టెస్టు ప్రారంభం
- తుది నిర్ణయం గంభీర్ తీసుకుంటారని కొటక్ వెల్లడి
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కోచింగ్ సిబ్బంది రెండుగా విడిపోనుంది. వన్డేలు, టెస్టు సిరీస్‌లకు వేర్వేరుగా సన్నద్ధమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ 10న హామిల్టన్‌లో జరిగే మూడో వన్డే తర్వాత ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వన్డే జట్టుతోనే కొనసాగనున్నారు. మిగిలిన రెండు వన్డేల కోసం జట్టుతో కలిసి మౌంట్ మాంగనూయికి వెళ్లనున్నారు. మరోవైపు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ టెస్టు జట్టుతో కలిసి వెల్లింగ్టన్‌కు వెళ్లనున్నారు. అక్కడ టెస్టు సిరీస్‌కు సన్నాహక శిబిరంలో పాల్గొంటారు.
2027లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ ఫార్మాట్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని కొటక్ తెలిపారు. గంభీర్ వన్డే జట్టుతో ఉండే అవకాశం ఉందని, అయితే తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని చెప్పారు. ప్రణాళికలో మార్పులు ఉండొచ్చని స్పష్టం చేశారు.
ఇక టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ నవంబర్ 11న ప్రారంభం కానుంది. తొలి టెస్టు నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో మొదలవుతుంది. ఈలోగా ఐదు నుంచి ఆరు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. న్యూజిలాండ్ పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఆటగాళ్ల ఫిట్‌నెస్, పని భారంపై దృష్టి పెట్టనున్నారు.
వన్డే జట్టు నుంచి గర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్ కూడా టెస్టు జట్టుకు సహకరించేందుకు న్యూజిలాండ్‌లోనే ఉండనున్నారు. నెట్ బౌలర్లుగా వ్యవహరించడంతో పాటు అవసరమైతే రిజర్వ్ ఆటగాళ్లుగా అందుబాటులో ఉంటారు.