- న్యూజిలాండ్‌తో రెండో వన్డే తర్వాత కేఎల్ రాహుల్ ఉదారత
- 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుగా వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను స్టేడియం అధికారికి బహుమతి
- రాహుల్ మంచి మనసుపై ప్రశంసలు కురిపించిన బీసీసీఐ
- ఈ ఘటనతో ఆశ్చర్యపోయానన్న మహిళా అధికారి
- వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం
టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలోనే కాదు, బయట కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఆటలో చూపిన ప్రతిభకు వచ్చిన పురస్కారాన్ని ఓ స్టేడియం సిబ్బందికి బహుమతిగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాహుల్ 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద అతనికి ఒక స్మార్ట్‌ఫోన్‌ను బహూకరించారు. అయితే, ఆ ఫోన్‌ను రాహుల్ తన వద్ద ఉంచుకోకుండా, వెల్లింగ్‌టన్‌లోని హెన్రీ స్టేడియంలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచాడు.
ఈ మధుర క్షణానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సదరు మహిళా అధికారి తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. "అతను తన ఫోన్‌ను నాకు ఇచ్చేశారు. నేను కాస్త షాక్‌లో ఉన్నాను. వారు ఇంత దయతో దీన్ని నాకు ఇవ్వడం గొప్ప విషయం. నేను దీన్ని అస్సలు ఊహించలేదు" అంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "పెద్ద ఆటగాడు. అంతకంటే పెద్ద మనసు. దయ, స్వచ్ఛమైన క్లాస్ (KLaas)" అంటూ బీసీసీఐ రాహుల్‌ను అభినందించింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను కుదించారు. డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఎల్లుండి హామిల్టన్‌లో జరగనుంది.