- షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు
- కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు
- ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి ఆమె తరఫు న్యాయవాదుల లేఖ
- పాస్‌పోర్టు అవసరం లేదని, భారత్ ఆమెను అప్పగించాలంటున్న బంగ్లా ప్రభుత్వం
- హసీనాకు మరణశిక్ష విధించిన బంగ్లా ప్రత్యేక కోర్టు
భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి ఆమె తరఫు న్యాయవాదులు లేఖ రాశారు. అయితే హసీనాను స్వదేశానికి రప్పించేందుకు పాస్‌పోర్టు అవసరం లేదని, భారత్ ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చకు దారితీసింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. హసీనా తరఫు న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి లేఖ పంపారు. గతంలో ఆమె పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పత్రాలు జారీ చేయాలని కోరారు. వీలైనంత త్వరగా దరఖాస్తును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అధికారం కోల్పోయిన తర్వాత హసీనా భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.
హసీనాకు కొత్త పాస్‌పోర్టు జారీ చేయాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ స్పష్టం చేశారు. భారత్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని కోరారు. మరోవైపు న్యాయశాఖ మంత్రి ఎం.డి. అసదుజ్జమాన్ కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా సాగుతుందని తెలిపారు.
2024లో నిరసనల అణచివేతకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ప్రత్యేక న్యాయస్థానం 2025 నవంబరులో హసీనాను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఆమె తిరస్కరిస్తున్నారు. డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోవాలన్నది ఆమె ప్రణాళిక. ఈ పరిణామం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశముంది.