- దీపావళి మరుసటి రోజే ఢిల్లీలో ‘సివియర్’ కేటగిరీకి పడిపోయిన గాలి నాణ్యత
- ఉదయం వేళ 483కి చేరిన ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
- కళ్ల మంటలు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 3 ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, నగరంలో గాలి నాణ్యత ‘సివియర్’ కేటగిరీకి పడిపోయింది. దట్టమైన విషపూరిత పొగమంచు నగరాన్ని పూర్తిగా కమ్మేసింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వివరాల ప్రకారం, ఉదయం 8.10 గంటల సమయానికి ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 483గా నమోదైంది. నగరంలోని 15 మానిటరింగ్ స్టేషన్లలో AQI 400 మార్కును దాటింది. వివేక్ విహార్‌లో 445, బురారీ క్రాసింగ్‌లో 441, జహంగీర్‌పురిలో 442, రోహిణిలో 438 వరకు AQI రికార్డైంది. ప్రైవేట్ స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ (IQAir) ప్రకారం షాహ్దరా ప్రాంతంలో AQI ఏకంగా 1,000 మార్కును దాటింది.
ఈ కాలుష్యం కారణంగా రోడ్లపై విజిబిలిటీ భారీగా తగ్గింది. అక్షరధామ్ ఫ్లైఓవర్ నుంచి చూస్తే సమీపంలోని ఆలయం కూడా కనిపించనంతగా పొగమంచు పేరుకుపోయింది. ఐటీవో, ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో వాహనదారులు ఉదయమే హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. గాల్లోని విషతుల్య పొగల వల్ల ప్రజలు కళ్ల మంటలు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలుష్య తీవ్రత దృష్ట్యా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) స్టేజ్ 3 నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను నిలిపివేసి, వాహనాలపై ఆంక్షలు విధించింది. ప్రైమరీ స్కూళ్లకు హైబ్రిడ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోతో పాటు ముంబైలోని బాంద్రా, ఘాట్కోపర్ తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది.