- నవంబర్ 25న బీహార్ మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం
- వేడుకలో ఏకంగా 4 లక్షల మంది అతిథులకు ఘనమైన విందు ఏర్పాట్లు
- ప్రత్యేక ఆకర్షణగా గుర్రపు పందెం, విజేతకు బహుమతిగా మహీంద్రా థార్ కారు
- పర్యావరణం దృష్ట్యా బాణసంచా రద్దు, ముంబై కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
- డిసెంబర్ 1న కోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోనున్న ఎమ్మెల్యే అనంత్ సింగ్
పెళ్లిళ్లంటే బ్యాంకెట్ హాళ్లు, డీజేలు, బంధువుల హడావుడి సహజం. కానీ, ఏకంగా నాలుగు లక్షల మందికి విందు, దేశవ్యాప్త గుర్రాలతో పందెం, గెలిచిన వారికి మహీంద్రా థార్ కారు బహుమతి.. అది ఎక్కడో కాదు.. బీహార్ బాహుబలి ఎమ్మెల్యే, జేడీయూ నేత అనంత్ సింగ్ కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని బిహ్తాకు చెందిన రిషికేశ్ కుమార్‌తో నవంబర్ 25న గ్రాండ్ గా జరిపించేందుకు సిద్ధమయ్యారు. అదే రోజు పూర్వీకుల గ్రామమైన లడ్మాలో చిన్న కుమారుడి ఉపనయనం కూడా జరగనుంది. ఈ వేడుక కోసం ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి డెకరేటర్లు, విదేశాల నుంచి ప్రత్యేక పూలు తెప్పిస్తున్నారు. మరోవైపు బార్హ్ మైదానంలో భారీ గుర్రపు పందెం నిర్వహించనున్నారు. ఇందులో గెలిచిన గుర్రం యజమానికి మహీంద్రా థార్, రెండో స్థానంలో నిలిచిన వారికి మోటార్ సైకిల్ అందించనున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు. ముంబై, భోజ్‌పురి కళాకారులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌తో పాటు నటుడు సోనూ సూద్ తదితరులకు ఆహ్వానాలు పంపారు. పెళ్లిళ్లకు రాజకీయాలకు సంబంధం లేదని, భారత్ నుంచే కాకుండా పాకిస్థాన్‌లోని పరిచయస్తులకూ కార్డులు పంపుతున్నానని అనంత్ సింగ్ పేర్కొన్నారు. ప్రజలే తమకు దేవుళ్లని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఇటీవలే జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన అనంత్ సింగ్.. దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 1న లొంగిపోవాల్సి ఉంది. ఈ గడువుకు సరిగ్గా వారం రోజుల ముందే ఆయన ఇంట ఈ భారీ వివాహ వేడుక జరగనుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.