ఇద్దరు సీజేపీ నేతలకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు తరలింపు
- జంతర్ మంతర్లోకి చొరబడిన సీజేపీ నేతలకు 5 రోజుల కస్టడీ
- సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
- ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మండిపాటు
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిబంధనలు ఉల్లంఘించి నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు కోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఈ ఉదయం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. మరో నేత అజింక్యా షిండేను రూ.5,000 వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం 14 మంది సీజేపీ సభ్యులు జంతర్ మంతర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి, ప్రైవేటు ఆస్తుల గుండా లోపలికి చొరబడి వారు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేశారు. సౌరవ్, అశుతోష్ గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో వీరిద్దరినీ తీహార్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో వీరిని తీహార్ జైలుకు పోలీసులు తరలించారు.
ఈ అరెస్టులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. "దేశంలో ఎమర్జెన్సీ విధించాలనుకుంటే అధికారికంగా ప్రకటించండి. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపినందుకే ఐదు రోజులు జైల్లో పెట్టే ఈ అనధికారిక ఎమర్జెన్సీ ఎందుకు?" అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసులు ఈ నెల 11న జంతర్ మంతర్ను నిరసనల వేదిక జాబితా నుంచి తొలగించారు. అనుమతి లేని ప్రాంతంలోకి చొరబడటం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.