- లోక్‌సభ స్థానాలను 850కి పెంచే యోచనపై రాహుల్ గాంధీ విమర్శలు
- నియోజకవర్గాల పునర్విభజనతో ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్న విపక్ష నేత
- ఈ నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన
- చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో రాహుల్ గాంధీ భేటీ
- సవరించిన బిల్లుకు డీఎంకే మద్దతు యథాతథంగా కొనసాగుతుందని స్పష్టత
లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడం ద్వారా దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ భారతదేశంలో ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు దేశ సమగ్రతకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, ప్రధానంగా తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ సంస్కృతి పరిరక్షకుడైన సోదరుడు స్టాలిన్ ఈ విషయంలో ముందుండి తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలని, బీజేపీ ప్రణాళికలు అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం కొన్ని స్థానాల మార్పు కాదని, ప్రతి నియోజకవర్గం సరిహద్దులను తిరగరాసే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అసోం, జమ్మూకశ్మీర్‌లలో స్థానిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా, విపక్షాల స్వరాన్ని అణచివేసేలా పునర్విభజన జరిగిన తీరును అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు, చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. డీఎంకే ఏం చెప్పిందన్న దానిపై తాను మాట్లాడటం లేదని, తాము స్టాలిన్‌తో చర్చించిన అంశాలను మాత్రమే వివరిస్తున్నానని చెప్పారు. ఈ పరిణామం తమిళ భాషకు, తమిళ ప్రజలకు, భారత సమాఖ్య వ్యవస్థకు తీవ్ర సవాల్ అని స్టాలిన్‌కు వివరించినట్లు ఆయన వెల్లడించారు. దేశభక్తి కలిగిన ప్రతీ ఒక్కరూ ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలబడాలని తాము కోరినట్లు తెలిపారు.
ప్రస్తుతం లోక్‌సభలో డీఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. సోమవారం ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో, ఓటింగ్‌లో పార్టీ వైఖరిని మార్చుకోవాల్సిందిగా కోరేందుకు ‘ఇండియా’ కూటమి నేతలు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం కూడా సవరించిన బిల్లుకు డీఎంకే మద్దతు యథాతథంగానే కొనసాగుతుందని స్టాలిన్ చెప్పడం తెలిసిందే.