ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తిరుపతి పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ, అమర రాజా గ్రూప్ సీఎండీ గల్లా జయదేవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తిరుపతి జిల్లా కరకంబాడి సమీపంలోని అమర రాజా ఆడిటోరియంలో సిద్ధార్థ్ గల్లా, హ్యేయిన్ కిమ్‌ల వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు విచ్చేసిన మంత్రి నారా లోకేశ్ నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులతో మంత్రి కాసేపు మాట్లాడారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా, దక్షిణ కొరియాకు చెందిన హ్యేయిన్ కిమ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నవంబర్ 25న వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఘట్టమనేని, గల్లా కుటుంబాలతో పాటు వధువు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం కరకంబాడిలోని అమర రాజా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు.
20261129frac7a0526ae5b.jpg20261129fr51fba819e017.jpg20261129fr0815b93c99b3.jpg20261129frab3d6b08bfe3.jpg20261129fr3ec57a85e8ce.jpg20261129fr6b78b100e530.jpg20261129fr42068265768c.jpg20261129fr3a6a34e46f45.jpg20261129fr6f0260d767cb.jpg20261129fr6f52dccf9b47.jpg20261129fr6c78fb634950.jpg20261129fr9d1ffba5252d.jpg20261129frbdfcd56788aa.jpg20261129fr4c02240eee72.jpg20261129fr680615e215e0.jpg20261129frdb1d38b73589.jpg20261129frfedb925a572e.jpg20261129frba602419d4d3.jpg20261129frfabeea65e1f1.jpg20261129fr520317665795.jpg20261129frd1b8929c5620.jpg20261129fre434edf24269.jpg20261129frbd9c1c5e31de.jpg