ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీపై తేజస్వి సూర్య ఆగ్రహం
- దేశంలో అరాచకం సృష్టించేందుకు రాహుల్ గాంధీ యత్నిస్తున్నారని విమర్శలు
- గందరగోళం, అస్థిరత ఉంటేనే ఆయన రాజకీయాలు సక్సెస్ అవుతాయని వ్యాఖ్య
- ప్రధాని మోదీ దేశానికి రాజకీయ స్థిరత్వం ఇచ్చారన్న తేజస్వి సూర్య
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. దేశంలో గందరగోళం, అస్థిరత నెలకొంటేనే తన రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ఆశయాలు నెరవేరతాయని భావిస్తున్నారని ఆయన విమర్శించారు.
మంగళవారం 'ఇండియా' కూటమి పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు సుమారు 260 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు తేజస్వి సూర్య పైవిధంగా స్పందించారు.
"గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ అందించిన రాజకీయ స్థిరత్వం వల్లే దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. ఈ స్థిరత్వం కారణంగానే భారత్ ఆర్థిక వృద్ధిని సాధించడంతో పాటు ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలు అదుపులోకి వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడించింది" అని తేజస్వి సూర్య పేర్కొన్నారు.
ప్రజలు పదేపదే తిరస్కరిస్తుండటంతో రాహుల్ గాంధీ తీవ్ర నిరాశకు గురయ్యారని, అందుకే ఈసీ, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. "కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాహుల్ గాంధీ అరాచక రాజకీయాల కొనసాగింపు మాత్రమే. దేశ శ్రేయస్సును కాంక్షించే వారెవరూ ఇటువంటి రాజకీయాలను అంగీకరించరు" అని ఆయన వ్యాఖ్యానించారు.