- అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఆగిపోయిన నీటి సరఫరా
- గడ్డం చేసుకుంటుండగా నీళ్లు ఆగిపోయాయన్న నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు
- రాష్ట్రపతి భవనంలోనూ తప్పని విద్యుత్, తాగునీటి సమస్యలు
- గ్యాస్ కొరత, జలవిద్యుత్ క్షీణతతో నైజీరియాలో కొనసాగుతున్న సంక్షోభం
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామంటూ అధ్యక్షుడి భరోసా
చుట్టూ భారీ భద్రత, చేతినిండా అధికారం, సకల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన అధికారిక భవనం.. తీరా ఉదయాన్నే అద్దం ముందు నిలబడి సేవింగ్ చేసుకుంటుంటే కుళాయిలో చుక్క నీరు రాకపోతే? సామాన్యుడికి నిత్యం ఎదురయ్యే ఇలాంటి అనుభవమే స్వయంగా ఓ దేశాధినేతకు ఎదురైతే? వినడానికి కాస్త వింతగా అనిపించినా, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబుకు ఇటీవల సరిగ్గా ఇలాంటి చికాకే ఎదురైంది. తన దేశ ప్రజలు ఏ సమస్యలతో రోజూ సతమతమవుతున్నారో, దేశాధ్యక్షుడిగా తానూ అదే అనుభవాన్ని చవిచూశానని ఆయన స్వయంగా వెల్లడించారు.
లాగోస్‌లో ఆదివారం జరిగిన ఒక కుటుంబ ప్రార్థనా సమావేశంలో అధ్యక్షుడు బోలా టినుబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అధికారిక నివాసమైన 'అసో రాక్' భవనంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. గత బుధవారం తాను షేవింగ్ చేసుకుంటుండగా అకస్మాత్తుగా నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. "రాష్ట్రపతి భవనంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చాలామందికి తెలియదు. ఆ సమయంలో నీళ్లు ఆగిపోయాయి. ఈ లోపాలన్నింటినీ మేము సరిదిద్దుతాం. వెలుగు లేదు, నీళ్లు లేవు, విద్యుత్ లేదు అంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడే మా ప్రయాణం మొదలైంది. సమస్యలన్నింటినీ కచ్చితంగా అధిగమిస్తాం.. నైజీరియా కోసం చేసి చూపిస్తాం" అని టినుబు స్పష్టం చేశారు.
అబూజాలోని 'అసో విల్లా' (అసో రాక్) నైజీరియా అధ్యక్షుడి అధికారిక నివాసంతో పాటు పరిపాలనా కేంద్రంగా వ్యవహరిస్తోంది. దేశంలోనే అత్యున్నత ప్రాంగణమైన ఈ భవనానికి నిరంతర విద్యుత్ కోసం గత ఏడాది సుమారు 10 బిలియన్ నైరాలను (దాదాపు 7.2 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసి సోలార్ మినీ-గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ గ్రిడ్‌పై ఆధారపడకుండా విల్లాకు ప్రత్యేకంగా విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ విద్యుత్, నీటి కొరత తలెత్తడం గమనార్హం.
నైజీరియాలో ప్రస్తుతం విద్యుత్ కోతలు పెరిగిపోవడానికి గ్యాస్ సరఫరాలో కొరత, జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోవడమే ప్రధాన కారణాలని అధికారులు చెబుతున్నారు. ప్రధాన గ్రిడ్ పూర్తిగా కుప్పకూలకపోయినప్పటికీ, లాగోస్, అబూజా వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు రొటేషన్ పద్ధతిలో కోతలు విధిస్తున్నాయి. మరోవైపు పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా పైపులైన్లు, శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో తాగునీటి ఎద్దడి ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది.
ఈ పరిణామం నైజీరియా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2022 నాటి ఎన్నికల ప్రచారంలో టినుబు మాట్లాడుతూ.. "ఎలాగైనా సరే దేశంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాం. ఈ హామీని నెరవేర్చకపోతే రెండోసారి నన్ను ఎన్నుకోవద్దు" అని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు 2027 జనవరి 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనానికే విద్యుత్, నీళ్లు సరిగా లేకపోవడం ఆయన పాలనా వైఫల్యానికి నిదర్శనమని ప్రధాన ప్రతిపక్ష నాయకులు అతికు అబూబకర్, పీటర్ ఒబి వర్గాలు విమర్శిస్తున్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా మెరుగుపడిందని, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటీవల 2 బిలియన్ డాలర్ల వ్యయంతో 'ఈస్ట్-వెస్ట్ సూపర్ గ్రిడ్' ప్రాజెక్టును ఆమోదించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.