శభాష్ గాయత్రీ.. మీ సహృదయానికి వందనాలు: సీఎం చంద్రబాబు
- ద్వారకాతిరుమల ఆలయంలో దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించిన మహిళా ఉద్యోగిని
- 'మానవ సేవే మాధవ సేవ' అని చాటి చెప్పిన స్ఫూర్తి అభినందనీయం అన్న సీఎం
- గాయత్రిని శాలువాతో సత్కరించి అభినందించిన ఆలయ ఈవో త్రినాథరావు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో గాయత్రిపై వెల్లువెత్తిన ప్రశంసలు
మానవత్వ పరిమళం వెల్లివిరిసిన ఒక అపురూప ఘటనకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రశంసలు లభించాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కేంద్రంలో పనిచేస్తున్న గాయత్రి అనే మహిళా ఉద్యోగినిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. చేతులు లేని దివ్యాంగ భక్తుడికి ఆప్యాయంగా అన్నం తినిపించి ఆమె చూపిన సహృదయానికి 'శభాష్ గాయత్రీ' అంటూ అభినందించారు.
అసలేం జరిగిందంటే..!
ఈ నెల 3న భీమడోలు మండలం పాతూరు గ్రామానికి చెందిన వాడపల్లి రాంబాబు అనే దివ్యాంగుడు ద్వారకాతిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని నిత్యాన్నదాన కేంద్రానికి భోజనం కోసం వెళ్లారు. రెండు చేతులు లేకపోవడంతో ఆయన భోజనం చేసేందుకు ఇబ్బంది పడుతుండటాన్ని అక్కడే పనిచేస్తున్న గాయత్రి గమనించారు.
వెంటనే ఆయన వద్దకు వెళ్లి, ఆప్యాయంగా పలకరించి, అన్నంలో కూర కలిపి తన చేతులతో తినిపించి ఆయన ఆకలి తీర్చారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న ఎవరో భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. "శభాష్ గాయత్రీ.. చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం" అంటూ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి తనను అభినందించడంపై గాయత్రి ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ఆలయ అధికారుల సత్కారం
గాయత్రి చూపిన సేవాభావాన్ని ద్వారకాతిరుమల ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు కూడా ప్రత్యేకంగా అభినందించారు. అన్నదాన భవనంలో ఆమెకు శాలువా కప్పి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. తోటి మనిషి పట్ల గాయత్రి చూపిన నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఈవో కొనియాడారు.