- నేటి రాత్రి 11:50 గంటలతో ముగియనున్న జేఈఈ మెయిన్ సాధారణ రిజిస్ట్రేషన్ గడువు
- ఇప్పటివరకు ఫీజు చెల్లించి ప్రక్రియ పూర్తి చేసుకున్న 13.10 లక్షల మంది అభ్యర్థులు
- మొత్తంగా 15 లక్షలకు పైగా అభ్యర్థుల నుంచి అందిన దరఖాస్తు ఫారమ్‌లు
- రేపటి నుంచి నవంబర్ 26 వరకు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం
- గుర్తింపు ధ్రువీకరణ సమస్యలు రాకుండా డిజిలాకర్ ద్వారా లాగిన్ కావాలని ఎన్‌టీఏ సూచన
జేఈఈ (మెయిన్) 2027 సెషన్-1 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక వివరాలను వెల్లడించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఆదివారం రాత్రి 11:50 గంటలతో ముగియనుండగా, అప్పటికే 13.10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపింది.
సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఎన్‌టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 15,04,866 రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు సమర్పించగా, అందులో 13,10,493 మంది అభ్యర్థులు ఫీజు చెల్లింపును విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణ ఫీజుతో దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకే తుది అవకాశమని స్పష్టం చేసింది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని, లేట్ ఫీజుతో నవంబర్ 26 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.
అభ్యర్థులు తమ దరఖాస్తులను అసంపూర్తిగా వదిలేయవద్దని ఎన్‌టీఏ సూచించింది. తదుపరి దశల్లో గుర్తింపు ధ్రువీకరణ, బయోమెట్రిక్ ప్రక్రియల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు డిజిలాకర్, జన్ పరిచయ్ లేదా ఈ-ప్రమాణ్ ద్వారా లాగిన్ కావాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ఫారమ్ నింపే ముందే డిజిలాకర్ ద్వారా రీ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. అలాగే దేశీయ, విదేశీ అభ్యర్థులకు పౌరసత్వం, ఆధార్ వివరాల ఎంపికలో ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఎన్‌టీఏ జారీ చేసింది.