హైదరాబాద్‌లో యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి
Advertisement

హైదరాబాద్‌లో యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి

Young doctor dies under suspicious circumstances in Hyderabad
  • మియాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి మృతి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
  • మూడు రోజుల క్రితం స్నేహితుడితో హైదరాబాద్ వచ్చినట్టు గుర్తింపు
  • ఫోన్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
  • పరారీలో ఉన్న స్నేహితుడి కోసం కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్‌‌లో ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఆదిత్య నగర్‌లోని ఓ ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు (27) సంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి. మహబూబ్‌నగర్‌లో వైద్య విద్యను అభ్యసించిన ఆమె, ఇటీవల వరంగల్‌లో పీడియాట్రిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం తన స్నేహితుడైన ఓ యువకుడితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, ఇక్కడ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు.

కుమార్తె ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, ఆమె మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అనంతరం శుక్రవారం మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని పరిశీలించగా, అప్పటికే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది.

ఈ ఘటనపై మియాపూర్ సీఐ జయరాం మాట్లాడుతూ, మృతురాలితో పాటు ఉన్న యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాట్లు వెల్లడించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Young Doctor
Hyderabad
Miyapur
Suspicious Death
Hafeezpet
Police Investigation

More Telugu News