- పుణే ఎంఐటీ కాలేజీ లిఫ్ట్‌లో 12 గంటల పాటు చిక్కుకుపోయిన విద్యార్థిని
- విద్యుత్ అంతరాయంతో పాటు, పనిచేయని ఎమర్జెన్సీ అలారం
- లిఫ్ట్‌లో మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో బయటకు అందని సమాచారం
- రాత్రంతా గాలించి గురువారం ఉదయం రక్షించిన పోలీసులు
- భద్రతా లోపాలపై కాలేజీ యాజమాన్యానికి పోలీసుల నోటీసులు
మహారాష్ట్రలోని పుణే నగర శివారు లోని కల్భోర్ పరిధిలోని ఎంఐటీ కాలేజీలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. కళాశాలకు చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని దాదాపు 12 గంటల పాటు రాత్రంతా లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయింది. తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆమెను గురువారం ఉదయం పోలీసులు, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 18 బుధవారం సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లేందుకు ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఎక్కింది. ఆ సమయంలో కాలేజీలో విద్యుత్ సరఫరాలో పదేపదే అంతరాయం కలగడంతో లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ఆమె లోపలే చిక్కుకుపోయింది. లిఫ్ట్ లోపల మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించలేకపోయింది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ అలారం కూడా మోగకపోవడంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బందికి ఆమె లోపల ఉన్న విషయం తెలియలేదు.
రాత్రి ఎంత సమయమైనా విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, సోదరి కళాశాల పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. ఆచూకీ లభించకపోవడంతో వెంటనే లోని కల్భోర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు, కుటుంబ సభ్యులతో కలిసి కళాశాల ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాత్రంతా గాలించారు. చివరకు నవంబర్ 19 గురువారం ఉదయం దాదాపు 7 గంటల సమయంలో కాలేజీ లిఫ్ట్‌లోనే ఆమె చిక్కుకుని ఉన్నట్లు గుర్తించి, రక్షించారు.
ఈ ఘటనపై లోని కల్భోర్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భద్రతా ఏర్పాట్లలో జరిగిన లోపాలపై కళాశాల యాజమాన్యం నుంచి వివరణ కోరారు. మరోవైపు విశ్వవిద్యాలయం కూడా ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. లిఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూస్తున్న సంస్థకు సైతం నోటీసులు జారీ చేసి వివరణ అడిగారు. అత్యవసర అలారం వ్యవస్థ పనిచేయకపోవడం, జనరేటర్ బ్యాకప్ లేకపోవడం, కళాశాల సమయం ముగిసిన తర్వాత భద్రతా తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడంపై అధికార యంత్రాంగం దర్యాప్తు జరుపుతోంది.