శ్రీవారి భక్తులకు గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి భక్తులకు గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD cancels VIP Break Darshan for two days due to heavy rush
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
  • సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్ణయం
  • ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు
  • రెండు రోజుల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడి  
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు గాను, రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్ 1 (గురువారం), అక్టోబర్ 5 (సోమవారం) తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అయితే, ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం ఈ రద్దు నుంచి మినహాయింపు ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా, మరో 30 వేల మంది భక్తులు మరుసటి రోజు దర్శనం కోసం తిరుమలలోనే వేచి ఉంటున్నారు.

పెరటాసి మాసం కావడంతో పాటు వరుస సెలవులు ఉండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి, ముందు రోజుల్లో అంటే సెప్టెంబర్ 30, అక్టోబర్ 4 తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి, టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Advertisement
TTD
Tirumala VIP Break Darshan
Srivari Darshan Cancellation
Tirumala Tirupati Devasthanams
Tirumala Heavy Crowd
Tirupati Temple News

More Telugu News