గోల్డ్ లోన్లకు బ్రేక్.. పర్సనల్ లోన్లకు మళ్లీ డిమాండ్!
- మళ్లీ వేగం పుంజుకున్న పర్సనల్ లోన్లు
- రూ.18.6 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్లు
- 30 శాతం పెరిగిన ఎన్‌బీఎఫ్‌సీల వ్యక్తిగత రుణాలు
- 1.8 శాతానికి తగ్గిన పర్సనల్ లోన్ బకాయిలు
- పర్సనల్ లోన్ల వేగంగా పెరగొచ్చని యూబీఎస్ అంచనా
ఒకప్పుడు అత్యవసర ఖర్చులకు వెంటనే డబ్బు కావాలంటే చాలామంది బంగారాన్ని తాకట్టు పెట్టేవారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో గోల్డ్ లోన్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతున్నట్లు కనిపిస్తోంది. పర్సనల్ లోన్లు వేగం పుంజుకుంటున్నాయి. త్వరలో గోల్డ్ లోన్లను దాటి అత్యంత వేగంగా పెరుగుతున్న రుణ విభాగంగా మారొచ్చని యూబీఎస్ గ్లోబల్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది.
గోల్డ్ లోన్లకు ఎందుకు ఇంత డిమాండ్?
బంగారం ధరలు పెరగడం గోల్డ్ లోన్లకు ప్రధానంగా కలిసొచ్చింది. 2025-26లో గోల్డ్ లోన్లు దాదాపు 50 శాతం పెరిగి రూ.18.6 లక్షల కోట్లకు చేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో వీటి వాటా కూడా 2018-19లో ఉన్న ఒక శాతం నుంచి ఇప్పుడు ఐదు శాతానికి పెరిగింది.
బంగారం ధరలు పెరగడంతో ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం వచ్చింది. దీంతో గోల్డ్ లోన్ వ్యాపారం వేగంగా విస్తరించింది. అయితే ఇప్పుడు బంగారం ధరల పెరుగుదల కొంత స్థిరపడటంతో ఈ వేగం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
పర్సనల్ లోన్లు ఎందుకు పుంజుకున్నాయి?
గత రెండేళ్ల కాలంలో పర్సనల్ లోన్ల వృద్ధి నెమ్మదించింది. రుణ నిబంధనలు కఠినం కావడం, ఇప్పటికే ఎక్కువ అప్పులు తీసుకున్నవారి సంఖ్య పెరగడం ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది.
ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆగస్టు వరకు ఎన్‌బీఎఫ్‌సీల (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) పర్సనల్ లోన్లు ఏడాది ప్రాతిపదికన దాదాపు 30 శాతం పెరిగాయి. బ్యాంకుల్లో తొమ్మిది శాతం వృద్ధి నమోదైంది. రెండు విభాగాల్లోనూ రెండేళ్లలో ఇదే అత్యంత వేగమైన వృద్ధి.
ఎవరి రుణాల్లో సమస్యలు తగ్గుతున్నాయి?
పర్సనల్ లోన్ల విషయంలో మరో సానుకూల మార్పు కనిపిస్తోంది. 30 రోజుల్లోపు బకాయిలుగా మారిన వ్యక్తిగత రుణాల వాటా 2024 జూన్‌లో 3.5 శాతం ఉండగా.. 2026 ఆగస్టుకు 1.8 శాతానికి తగ్గింది. అదే సమయంలో గోల్డ్ లోన్లలో బకాయిలు పెరిగాయి. మార్చిలో 0.7 శాతంగా ఉన్న ఈ రేటు ఆగస్టుకు 2.6 శాతానికి చేరింది.
ఎన్‌బీఎఫ్‌సీల వాటా కూడా పెరిగింది
గోల్డ్ లోన్ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీలు కూడా భారీగా విస్తరించాయి. 2017-18లో ఈ విభాగంలో వాటా మూడు శాతంగా ఉండగా.. ఆగస్టు నాటికి 20 శాతానికి చేరింది. అయితే బంగారం ధరల పెరుగుదల ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఇకపై వాటి మార్కెట్ వాటా పెరుగుదల వేగం తగ్గొచ్చని నివేదిక అంచనా వేసింది.
వడ్డీ రేట్లు పెరిగినా?
వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నా పర్సనల్ లోన్ల వృద్ధి పూర్తిగా ఆగిపోదని నివేదిక అంచనా వేసింది. 2026 చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు మొత్తం 50 బేసిస్ పాయింట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్ మాత్రం 100 బేసిస్ పాయింట్ల పెంపును అంచనా వేస్తున్నట్లు తెలిపింది.