చాలా మంది ఈ గింజలను తప్పుగా తింటున్నారు.. అధిక ప్రయోజనాల కోసం ఇలా తీసుకుంటే మేలు!

చాలా మంది ఈ గింజలను తప్పుగా తింటున్నారు.. అధిక ప్రయోజనాల కోసం ఇలా తీసుకుంటే మేలు!

Most people eat seeds the wrong way nutritionist reveals hacks for maximum nutrition
  • చియా గింజలను నానబెట్టి పెరుగుతో తింటే అధిక ప్రయోజనం
  • అవిసె గింజల పొడికి సోంపు కలిపి తీసుకుంటే మేలు
  • నువ్వులను రాగి పిండిలో కలిపి రొట్టెలు చేసుకోవాలని సూచన
  • గుమ్మడి గింజలను తాజా పండ్లపై చల్లుకోవాలని నిపుణుల సలహా
  • సబ్జా గింజలను నానబెట్టి కొబ్బరి నీళ్లలో కలపాలని సూచన
ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో రోజువారీ ఆహారంలో వివిధ రకాల గింజలకు ప్రాధాన్యం పెరిగింది. చియా, అవిసె, గుమ్మడి, నువ్వులు, సబ్జా గింజలను చాలామంది వివిధ రకాలుగా తీసుకుంటున్నారు. అయితే వీటిని ఎలా తింటున్నామన్నదీ ముఖ్యమేనని పోషకాహార నిపుణురాలు శ్రుతి కైన్యా సూచించారు. సరైన ఆహారంతో కలిపి తీసుకుంటే వాటిలోని పోషకాలను శరీరం మెరుగ్గా వినియోగించుకోగలదని తెలిపారు.

చియా: చియా గింజలను ముందుగా నానబెట్టాలి. అనంతరం పెరుగులో కలిపి తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్‌, ప్రొటీన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల ప్రొబయోటిక్‌ ప్రయోజనాలు కూడా లభిస్తాయని శ్రుతి తెలిపారు.

అవిసె: అవిసె గింజలను పొడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. దీనికి సోంపు కలిపి తీసుకోవచ్చు. భోజనం తర్వాత మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా తీసుకోవడం వల్ల ఉబ్బరం తగ్గేందుకు తోడ్పడొచ్చని ఆమె పేర్కొన్నారు.

నువ్వులు: నువ్వులను మెత్తగా పొడి చేసి రాగి పిండిలో కలపాలి. ఈ మిశ్రమంతో రొట్టెలు చేసుకోవచ్చు. నువ్వులు, రాగి రెండింటి ద్వారా ఆహారంలో కాల్షియం పెంచుకోవచ్చని సూచించారు.

గుమ్మడి: గుమ్మడి గింజలను వేయించి తాజా పండ్లపై చల్లుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా ఆహారంలో మెగ్నీషియం పెంచుకోవచ్చని శ్రుతి తెలిపారు.

సబ్జా: మలబద్ధకం సమస్య ఉన్నవారు సబ్జా విత్తనాలను నానబెట్టి కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగొచ్చని ఆమె సూచించారు. ఇది జీర్ణక్రియకు తోడ్పడి మలబద్ధకం నుంచి ఉపశమనానికి సహకరించవచ్చని తెలిపారు.

ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Advertisement
Shruti Kainya
Healthy seeds benefits
Chia seeds nutrition
Flax seeds for bloating
Pumpkin seeds magnesium
Sabja seeds for constipation

More Telugu News