- ముంబై లోకల్ ట్రైన్లో వేధింపులను అడ్డుకున్న యువతిపై దాడి
- రైలు నుంచి కిందకు తోసేయడంతో ఎడమ చేయి కోల్పోయిన బాధితురాలు
- ఘటన తర్వాత పరారైన నిందితుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
- నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరిన బాధితురాలు
ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ యువతి దారుణానికి గురైంది. తనను అసభ్యంగా తాకుతున్న వ్యక్తిని ప్రతిఘటించడంతో, అతడు ఆమెను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఆమె తన ఎడమ చేతిని కోల్పోవడమే కాకుండా, తలకు 16 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన స్థానిక రైళ్లలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె బోరివలీ నుంచి విరార్ వెళుతున్న లోకల్ ట్రైన్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకడంతో ఆగ్రహించిన యువతి తన చెప్పుతో అతడిపై దాడి చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా, నిందితుడు ఆమెను దూషిస్తూ తన చెప్పుతో ఆమెపై దాడికి దిగాడు.
నైగావ్ స్టేషన్ రాగానే గొడవ మరింత ముదిరింది. నిందితుడు ఆమెను ప్లాట్‌ఫాం వైపు బలంగా తోసేశాడు. దీంతో ఆమె ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే రైలు కదలడంతో, ఆమె ఎడమ చేయి చక్రాల కింద నలిగి మోచేతి కింది నుంచి తెగిపోయింది. వెంటనే ఓ పోలీసు అధికారి, ఇతర ప్రయాణికులు ఆమెను ప్లాట్‌ఫాంపైకి చేర్చారు. ఈ గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని పారిపోయిన నిందితుడిని పోలీసులు కొన్ని గంటల తర్వాత పట్టుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ.. "ఇంట్లో మీకు అమ్మాచెల్లెళ్లు లేరా అని అడిగినా వినలేదు. నన్ను రైలులోంచి తోసేశాడు. నా జీవితం మొత్తం నాశనమైంది. ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు ఒంటిచేత్తో ఏం చేయగలను? నాకు న్యాయం కావాలి. అతడిని కఠినంగా శిక్షించాలి" అని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, నిందితుడిపై సెక్షన్ 109 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయకపోవడంపై బాధితురాలి కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. వారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన సహాయం కోరడంతో పార్టీ నేతలు రైల్వే పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. త్వరలోనే సంబంధిత సెక్షన్లను చేర్చుతామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.