5 నిమిషాల గూగుల్ మీట్.. 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఔట్.. అమెరికా సంస్థ షాకింగ్ నిర్ణయం
- ముందస్తు సమాచారం లేదని ఉద్యోగి ఆరోపణ
- రాత్రి షిఫ్ట్‌లో నిర్ణయం వెల్లడి
- 80 కుటుంబాలపై ప్రభావం
- పనితీరు సరిగా లేదని చెప్పారని ఉద్యోగి ఆరోపణ
అమెరికా ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న 80 మంది భారతీయ ఉద్యోగులకు ఊహించని షాక్ ఎదురైంది. కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌లో మొత్తం కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
తమ టీమ్‌ను ఆ రోజు ‘ఆపరేషనల్ కారణాల’తో ఇంటి నుంచే పనిచేయాలని సంస్థ ఆదేశించినట్లు ఉద్యోగి తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన షిఫ్ట్‌లో రాత్రి 9.30 గంటల వరకు పని చేసిన తర్వాత ఉన్నతాధికారులు అకస్మాత్తుగా గూగుల్ మీట్ ఏర్పాటు చేశారని చెప్పారు.
ఆ కాల్‌లో భారత కస్టమర్ సర్వీస్ టీమ్ మొత్తాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారని వెల్లడించారు. దాదాపు 80 మంది ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కేవలం ఐదు నిమిషాల కాల్‌తో 80 కుటుంబాలపై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రతపై భయంతో అదనపు సమయం పనిచేస్తూ, తమ పనిని మెరుగ్గా చేసేందుకు ప్రయత్నించామని ఆయన పేర్కొన్నారు. అయినా ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగాలు తొలగించడం బాధ కలిగించిందని అన్నారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనపై పలువురు స్పందించారు. ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తొలగింపుల వెనుక అమెరికాకు చెందిన డిజిటల్ బ్యాంకింగ్ సంస్థ బ్లూవైన్ ఉందని తెలుస్తోంది. చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలు, క్రెడిట్ సదుపాయాలను ఈ సంస్థ అందిస్తుంది.
భారత టీమ్ నుంచి ఆశించిన స్థాయిలో పనితీరు రావడం లేదని తమకు చెప్పినట్లు ఉద్యోగి తెలిపారు. అయితే అమెరికా టీమ్‌లోనే ఎక్కువగా ఉద్యోగుల మార్పులు, సెలవులు, పనిలో లోపాలు ఉన్నప్పటికీ భారత ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం మరింత కష్టపడి పనిచేశారని ఆయన పేర్కొన్నారు.