రూ.58,850 నుంచే.. 75 కిలోమీటర్ల మైలేజీ.. తక్కువ ధరలో బెస్ట్‌ బైక్స్‌ ఇవే..!

రూ.58,850 నుంచే.. 75 కిలోమీటర్ల మైలేజీ.. తక్కువ ధరలో బెస్ట్‌ బైక్స్‌ ఇవే..!

Best bikes at low price starting from 58850 with 75 km mileage
  • బైక్‌ల ధరలు రూ.58,850 నుంచి ప్రారంభం
  • టీవీఎస్‌ రేడియన్‌ అత్యంత చౌక మోడల్‌
  • కొన్ని బైక్‌లు 70-75 కిమీ మైలేజీ ఇచ్చే అవకాశం
  • హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, హెచ్‌ఎఫ్‌ 100 ధరలు రూ.60 వేల లోపే
  • షైన్‌ 100 ధర రూ.65,642
  • ప్లాటినా 100లో 200 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌
రోజువారీ ప్రయాణాలకు బైక్‌ కొనాలని చూస్తున్నారా? పెట్రోల్‌ ఖర్చు తగ్గడంతో పాటు బైక్‌ ధర కూడా అందుబాటులో ఉండాలంటే 100సీసీ నుంచి 115సీసీ విభాగంలోని కమ్యూటర్‌ మోడళ్లు మంచి ఆప్షన్‌గా ఉంటాయి. ఈ విభాగంలో రూ.58,850 నుంచే బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాస్తవ వినియోగంలో లీటరుకు 65 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తాయని కంపెనీలు పేర్కొంటున్న మోడళ్లు కూడా ఉన్నాయి. ఆ బైక్‌ల వివరాలు ఇవి..

టీవీఎస్‌ రేడియన్‌.. రూ.58,850 
ఈ జాబితాలో తక్కువ ధరతో లభించే బైక్‌ల్లో టీవీఎస్‌ రేడియన్‌ ఒకటి. రెట్రో డిజైన్‌, క్రోమ్‌ ఫినిష్‌ హెడ్‌ల్యాంప్‌, సౌకర్యవంతమైన సీటు దీని ప్రత్యేకతలు. 109.7సీసీ ఇంజిన్‌ 8.19 పీఎస్‌ పవర్‌, 8.7 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ వినియోగంలో సుమారు 65-70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంటున్నారు.

టీవీఎస్‌ స్పోర్ట్‌.. రూ.59,100 
స్పోర్టీ డిజైన్‌తో కనిపించే టీవీఎస్‌ స్పోర్ట్‌లో 109.7సీసీ ఇంజిన్‌ ఉంది. ఇది 8.29 పీఎస్‌ పవర్‌, 8.7 ఎన్ఎం టార్క్‌ ఇస్తుంది. ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌, ఎకానమీ, పవర్‌ మోడ్‌ సూచికలు, సింక్రనైజ్డ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాస్తవ వినియోగంలో 70-75 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌.. రూ.59,477 
97.2సీసీ ఇంజిన్‌తో వచ్చే హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ సాధారణ, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన కమ్యూటర్‌ బైక్ గా నిలుస్తుంది. 8.02 పీఎస్‌ పవర్‌, 8.05 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఐ3ఎస్‌ టెక్నాలజీ, అల్లాయ్‌ వీల్స్‌, సైడ్‌స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుమారు 65-70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంటున్నారు.

హీరో హెచ్‌ఎఫ్‌ 100.. రూ.59,839
హెచ్‌ఎఫ్‌ 100లో 97.2సీసీ ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌ ఉంటుంది. 8.02 పీఎస్‌ పవర్‌, 8.05 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అనలాగ్‌ మీటర్‌, కిక్‌ స్టార్ట్‌, డ్రమ్‌ బ్రేక్‌లు, ఇంటిగ్రేటెడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.

హోండా షైన్‌ 100.. రూ.65,642 
షైన్‌ 125 తరహా డిజైన్‌తో కనిపించే షైన్‌ 100లో 98.98సీసీ ఇంజిన్‌ ఉంటుంది. 7.38 పీఎస్‌ పవర్‌, 8.05 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. పొడవైన సీటు, ఈఎస్‌పీ టెక్నాలజీ, కాంబి బ్రేక్‌ సిస్టమ్‌, సైడ్‌స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుమారు 65-68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంటున్నారు.

బజాజ్‌ ప్లాటినా 100.. రూ.70,511 
ప్లాటినా 100లో 102సీసీ డీటీఎస్‌-ఐ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7.9 పీఎస్‌ పవర్‌, 8.3 ఎన్ఎం టార్క్‌ ఇస్తుంది. కంఫర్టెక్‌ సీటు, నైట్రాక్స్‌ సస్పెన్షన్‌, 200 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాస్తవ వినియోగంలో 70-75 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుందని పేర్కొంటున్నారు.

బజాజ్‌ సిటీ 110ఎక్స్‌.. రూ.74,390 
రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌తో కనిపించే సిటీ 110ఎక్స్‌లో 115.45సీసీ ఇంజిన్‌ ఉంటుంది. 8.6 పీఎస్‌ పవర్‌, 9.81 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. క్రాష్‌ గార్డులు, రియర్‌ లగేజ్‌ క్యారియర్‌, సెమీ నాబీ టైర్లు, బెల్లీ పాన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 170 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌, కాంబి బ్రేకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉన్నాయి.

హీరో స్ప్లెండర్‌ ప్లస్‌.. రూ.77,777
భారత్‌లో అత్యంత గుర్తింపు పొందిన కమ్యూటర్‌ బైక్‌లలో స్ప్లెండర్‌ ప్లస్‌ ఒకటి. 97.2సీసీ ఇంజిన్‌ 8.02 పీఎస్‌ పవర్‌, 8.05 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఐ3ఎస్‌ టెక్నాలజీ, ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, ఇంటిగ్రేటెడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. సుమారు 65-70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంటున్నారు.

గమనిక: పై ధరలన్నీ ఎక్స్‌షోరూం ధరలు. దీనికి పన్నులు, ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయి. డీలర్లను సంప్రదిస్తే వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం ఎంతో తెలుస్తుంది. ఆయా కంపెనీల వెబ్‌సైట్‌లోనూ ధరల వివరాలు ఉంటాయి.
Advertisement
Best Budget Bikes
Hero Splendor Plus
TVS Sport
Bajaj Platina 100
Honda Shine 100
High Mileage Commuter Bikes

More Telugu News