మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఊరట.. లైంగిక వేధింపుల కేసు కొట్టివేత
- పెళ్లిపేరుతో లైంగికంగా వేధించారంటూ యువతి ఫిర్యాదు
- ప్రైవేట్ ఫొటోలతో కాంతారావు బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణ
- రియల్ ఎస్టేట్ పేరిట రూ.రూ.4 లక్షలు తీసుకున్నారని ఆరోపణ
- ఇరుపక్షాల వాదనలు విని కేసు కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును న్యాయస్థానం కొట్టివేసింది. పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కాంతారావుపై కేసు నమోదైంది.
తన ప్రైవేట్ ఫొటోలతో కాంతారావు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారం పేరుతో తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాంతారావును అదుపులోకి తీసుకున్నారు.
తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.