- రైల్వేలో 1265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన
- దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 25 చివరి తేదీ
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు
- సీబీటీ, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- కంటి సర్జరీ చేయించుకున్న వారు ఈ పోస్టులకు అనర్హులు
భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు ఇది ముఖ్యమైన గమనిక. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ (CEN నం. 08/2026) దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 25 రాత్రి 11:59 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,265 ఖాళీలను భర్తీ చేయనుండగా, వీటిలో 133 పోస్టులను మాజీ సైనికులకు కేటాయించారు. అక్టోబర్ 27న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియకు నవంబర్ 25తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు నవంబర్ 27 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు rrbapply.gov.in లేదా rrb.indianrailways.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
అర్హతలు, వయోపరిమితి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అయితే, నవంబర్ 25, 2026 నాటికి డిగ్రీ ఫలితాలు వెలువడి ఉండాలి. తుది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు అనర్హులు. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం, జీతభత్యాలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా సింగిల్-స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది మెరిట్ జాబితాను సీబీటీ మార్కులకు 70 శాతం వెయిటేజీ, సీబీఏటీ మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి రూపొందిస్తారు. ఎంపికైన వారికి పే-లెవల్ 6 ప్రకారం నెలకు రూ.35,400 ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నింటినీ తిరస్కరిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ పోస్టులకు ‘A-2’ వైద్య ప్రమాణాలు తప్పనిసరి. గతంలో లాసిక్ లేదా ఇతర కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.