- జెప్టో ప్రారంభ కష్టాలను బయటపెట్టిన సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
- సిరీస్ సి ఫండింగ్ రోజే సాఫ్ట్‌వేర్ క్రాష్.. యాప్ మూసేయాల్సిన పరిస్థితి
- రాత్రికి రాత్రే కొత్త సాఫ్ట్‌వేర్ నిర్మించుకున్న ఇంజినీరింగ్ టీమ్
- లాంచింగ్ రోజు వచ్చింది కేవలం 31 ఆర్డర్లు మాత్రమే
- ఆ 31 ఆర్డర్లలో 15 తమ టీమ్ సభ్యులవేనని వెల్లడి
ప్రముఖ క్విక్-కామర్స్ సంస్థ 'జెప్టో' సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా, తమ సంస్థ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న రెండు ప్రధాన సవాళ్లను ఇటీవల వెల్లడించారు. అత్యంత కీలకమైన ఫండింగ్ ప్రకటన వెలువడాల్సిన రోజున సాఫ్ట్‌వేర్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం, అలాగే లాంచింగ్ రోజున కేవలం 31 ఆర్డర్లు మాత్రమే రావడం వంటి అనూహ్య పరిణామాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇంటర్వ్యూబిట్, స్కేలర్ సహ వ్యవస్థాపకుడు అభిమన్యు సక్సేనాతో జరిగిన 'స్కేలర్ పాడ్' పాడ్‌కాస్ట్‌లో కైవల్య ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జెప్టో తొలినాళ్లలో తమ కార్యకలాపాల నిర్వహణ కోసం యూకేకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడేది. సరిగ్గా సిరీస్-సి ఫండింగ్ ప్రకటన వెలువడే డిసెంబర్ 21వ తేదీన ఆ వ్యవస్థ అకస్మాత్తుగా మొరాయించింది. క్రిస్మస్ సెలవుల కారణంగా యూకే బృందం అందుబాటులో లేకపోవడంతో, యాప్‌ను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. "వినియోగదారులకు క్షమాపణలు చెప్పి, యాప్ షట్‌డౌన్ చేయడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు" అని వోహ్రా తెలిపారు. అయితే, వ్యవస్థాపకులతోపాటు ఐదారుగురు సభ్యులతో కూడిన చిన్న ఇంజినీరింగ్ బృందం రాత్రికి రాత్రే ఆ సాఫ్ట్‌వేర్‌ను రివర్స్ ఇంజినీరింగ్ చేసి, సొంతంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసింది. ఈ ఘటన తర్వాతే, కీలకమైన సాఫ్ట్‌వేర్‌లను అంతర్గతంగానే అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.
మరో సంఘటన గురించి ప్రస్తావిస్తూ.. 2021 ఫిబ్రవరి 15న జెప్టోను ప్రారంభించినప్పుడు భారీగా ప్రకటనలు ఇచ్చి విశేష స్పందన లభిస్తుందని ఆశించామని, కానీ ఆ రోజు కేవలం 31 ఆర్డర్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. "ఆ 31 ఆర్డర్లలో కూడా యాప్ పనితీరును పరీక్షించడానికి మేమే స్వయంగా ఇచ్చినవి కనీసం 15 వరకు ఉంటాయి. ఆ ఫలితం చూసి కాసేపు నిరాశ చెందినప్పటికీ, వెంటనే కోలుకుని ఆ సంఖ్యను అధిగమించే లక్ష్యంతో మరుసటి రోజుకు సిద్ధమయ్యాం" అని వోహ్రా పేర్కొన్నారు. అటువంటి ఆరంభ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించిన జెప్టో, నేడు భారత క్విక్-కామర్స్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.