కేటీఆర్ ను కలిసిన ప్రకాష్ అంబేద్కర్

Prakash Ambedkar meets KTR in Hyderabad
  • కేటీఆర్ నివాసానికి వచ్చిన ప్రకాష్ అంబేద్కర్
  • ప్రకాష్ అంబేద్కర్ ను ఘనంగా సత్కరించిన కేటీఆర్
  • పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించిన నేతలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో వంచిత్ బహుజన్ అగాడీ అధినేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డిలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులను ప్రకాష్ అంబేద్కర్‌కు కేటీఆర్ పరిచయం చేశారు. భేటీ అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌ను కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

Advertisement
Prakash Ambedkar
KTR
BRS Party
Vanchit Bahujan Aghadi
Hyderabad Politics
Telangana Political News

More Telugu News