ఫార్ములా ఈ-కార్ రేసు... కేటీఆర్ కు నోటీసులు

KTR Receives Notice in Formula ECar Race Case
  • కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
  • జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావులకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 31వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు అందులో పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 
Go Back to Shorts
KTR
KTR Formula E race
Formula E race Hyderabad
Arvind Kumar IAS
BLN Reddy HMDA
ACB Court summons

More Telugu News