వివాదాల మధ్య అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్... కాబోయే భర్త ఎవరు?

Ashu Reddy Engagement Announced Amidst Controversy
  • కోట్లాది రూపాయల చీటింగ్ కేసులో చిక్కుకున్న అషు రెడ్డి
  • దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
  • న్యాయపరమైన చిక్కుల మధ్యే ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రకటన
  • ఇది కేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని నెటిజన్ల అనుమానం
  • అషు రెడ్డి వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
సోషల్ మీడియా సంచలనం, బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి (వెంకట అశ్విని రెడ్డి) వ్యవహారం నాటకీయ మలుపు తీసుకుంది. ఒకవైపు కోట్ల రూపాయల చీటింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలగా, మరోవైపు ఎంగేజ్‌మెంట్ రింగ్ తో కూడిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం  సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే, లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే ఎన్నారై, తనను పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం చేసిందని హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2018 నుంచి తన నుంచి సుమారు రూ.9.35 కోట్లు వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని, తమపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ అషు రెడ్డి, ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో అషు రెడ్డికి న్యాయపరంగా ఇబ్బందులు పెరిగాయి.

ఈ నేపథ్యంలోనే, అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంగేజ్ మెంట్ ఫొటోలను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తీవ్రమైన ఆరోపణలతో కేసు విచారణ జరుగుతున్న కీలక సమయంలో ఈ ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కొత్త ట్విస్ట్‌తో అషు రెడ్డి వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. ఇంతకీ అషు రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్న వ్యక్తి ఎవరంటూ సర్వత్రా ఆసక్తి మొదలైంది. 
Go Back to Shorts
Ashu Reddy
Ashu Reddy engagement
Bigg Boss Ashu Reddy
YV Dharmendra
cheating case
Telangana High Court
software engineer
Hyderabad CCS
NRI
social media

More Telugu News