Rashmika Mandanna: పెళ్లై నెల రోజులు... రష్మిక ఎమోషనల్ పోస్ట్
డైనమిక్ హీరో విజయ్ దేవరకొండతో తన వివాహ బంధానికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తమ పెళ్లికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఓ సుదీర్ఘమైన నోట్ రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
"అప్పుడే పెళ్లై నెల రోజులు గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. పెళ్లి అనేది ఎప్పుడో జరిగే దూరపు ఆలోచనలా అనిపించేది. కానీ ఇప్పుడు మేం పెళ్లి చేసుకుని నెల రోజులైంది. ఇది నమ్మశక్యంగా లేదు. ఇది శాశ్వతమైన ప్రేమ" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో తనకు కవచంలా నిలిచిన స్నేహితులను ఆమె ఎంతగానో కొనియాడారు. తన పెళ్లిని ఒక అద్భుతంగా మార్చిన వారికి రష్మిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా తన స్నేహితురాలు ప్రియా మాగంటి గురించి ప్రస్తావిస్తూ.. "ఎన్నో ఏళ్లుగా నువ్వు నాకు ఒక బలమైన స్తంభంలా నిలిచావు. ఈ పెళ్లి ఇంత గొప్పగా జరిగిందంటే దానికి కారణం నువ్వే. నీకు కృతజ్ఞతలు అనే పదం కూడా సరిపోదు. నాకు ఏమీ తోచనప్పుడు నీకే ఫోన్ చేస్తాను. నువ్వు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉంటావు" అని ఎమోషనల్ అయ్యారు. అలాగే, తమ వినూత్న ఆలోచనలకు రూపమిచ్చి, పెళ్లిని అద్భుతంగా తీర్చిదిద్దిన వెడ్డింగ్ ప్లానర్ అర్పితను, ఆమె బృందాన్ని ఎంతగానో ప్రశంసించారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ఆభరణాలు రూపొందించిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు.
తన జీవితంలో ఉన్న మహిళా స్నేహితుల గురించి చెబుతూ.. "మీరంతా నన్ను ఎప్పుడూ వాస్తవంలో, ప్రశాంతంగా ఉంచుతారు. ఇదే నా చిన్న ప్రపంచం" అని పేర్కొన్నారు. పెళ్లి రోజుల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి ఆనందంగా గడపమని సలహా ఇచ్చిన తన ఆప్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే తమ పెళ్లి వేడుకలను పూర్తిగా ఆస్వాదించగలిగామని వివరించారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలకు, పోస్ట్‌కు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.