బడ్జెట్ ఎఫెక్ట్: ఆదివారం పనిచేస్తున్న స్టాక్ మార్కెట్.. ఫ్లాట్‌గా సూచీలు
- బడ్జెట్‌కు ముందు ఫ్లాట్‌గా కొనసాగుతున్న సూచీలు
- వివిధ రంగాలపై నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటిస్తారనే అంచనాలు
- స్వల్ప లాభాల్లో ప్రారంభమై, అతి స్వల్ప నష్టాల్లో కదలాడుతున్న సూచీలు
వివిధ రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి. మెటల్ రంగం మాత్రం 4.4 శాతం మేర క్షీణించింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లు పని చేస్తున్నాయి.